సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న రైతులు
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలోని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామంలో రేవంత్ రెడ్డి నివాసం ముందు వారి చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రైతులు రుణమాఫి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో రైతుల అప్పుల భాధలు గుర్తించారు. రుణమాఫీ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి స్వగ్రామంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.