పిడుగుపాటు తో మహిళ దుర్మరణం
నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం మొల్కచర్లలో పిడిగుపాటుకు మహిళ మృతి చెందిన ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం బాలాజీ తండాకు చెందిన జటావత్ నాగమణి పొలంలో కలుపు తీస్తోంది. ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. అందరూ ఇంటికి వెళుతుండగా బాల్నేపల్లి సబ్ స్టేషన్ దగ్గరకు రాగానే ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో నాగమణి అక్కడికక్కడే చనిపోయింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్ వెల్లడించారు.