Mar 15, 2025, 04:03 IST/
మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీను బహిష్కరించిన గిరిజన తెగ
Mar 15, 2025, 04:03 IST
ఒడిశాకు చెందిన మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీను భాత్రా గిరిజన తెగ వెలివేసింది. దీనికి కారణం ఆయన కులాంతర వివాహం చేసుకోవడమే. భాత్రా గిరిజన వర్గానికి చెందిన ఆయన ఇటీవల పెళ్లి చేసుకున్నారు. అది తమ గిరిజన తెగకు చెందిన అమ్మాయిని కాకుండా బ్రాహ్మణ కులానికి చెందిన సుశ్రీ సంగీత సాహూను పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో భాత్రా తెగ ఆయన్ను కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు చెప్పింది.