చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం నాడు స్థానిక మేకల లింగయ్య స్మారక భవనంలో జరిగిన సంఘం మండల స్థాయి సమావేశంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పామును గుళ్ళ అచ్చాలు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గీత కార్మికుల పెండింగ్ పెన్షన్ దరఖాస్తులను పరిశీలించి ఆరులైన వాళ్లందరికీ పెన్షన్లు ఎక్స్గ్రేషియాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.