రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లి శివారులో బైక్ చెట్టును ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల ప్రకారం పేరేపల్లికి చెందిన రూపని రాజశేఖర్ జేసీబీ డ్రైవర్, వెలిమినేడులో పని ముగించుకుని గ్రామానికి తిరిగి వెళ్తుండగా.. పేరేపల్లి శివారులో బైక్ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. తలకు బలమైన గాయం కావటంతో మృతి చెందాడు. ఏఎస్ఐ జానారెడ్డి కేసు నమోదు చేశారు.