AP: వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను వైసీపీ నిర్వీర్యం చేసిందన్నారు. 58 ఏళ్ల పాటు చేసిన అప్పుపై రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ రూ.14,155 కోట్లు వడ్డీ చెల్లిస్తుండగా.. జగన్ పాలన ముగిసే నాటికి రూ.24,944 కోట్లకు చేరిందన్నారు. జగన్ చేసిన అప్పుపై చెల్లించే వడ్డీనే రూ.11 వేల కోట్లు అధికమన్నారు.