నల్లగొండ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉదయం 12 గంటలకి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొని పార్టీ కార్యాలయంలో చెట్లను నాటారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి కేకును కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.