కేసీఆర్‌ను చూసి నాకు ఏడుపొచ్చింది: హరీశ్ రావు

59చూసినవారు
TG: కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ ఉద్యమం నాటి రోజులను మాజీ మంత్రి హరీష్ రావు గుర్తుచేసుకున్నారు. 'కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తున్నారు. అప్పటికి 11 రోజులైంది. కంట్రోల్ లో లేడు. వణుకుతున్నాడు. పట్టుదల మాత్రం వీడలేదు. నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఎంతో బాధపడ్డాం. కానీ ఆయన మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఏర్పాటు ప్రకటన ప్రారంభమైంది అంటేనే దీక్ష విరమిస్తా అన్నాడు' అని హరీశ్ రావు భావోద్వేగానికి లోనయ్యాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్