తెలంగాణ భవన్‌లో కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలో భాగంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. 'కేసీఆర్ తెలంగాణ హీరో. మా నాన్న నాకు ఒక్కడికే హీరో కాదు మొత్తం తెలంగాణ జాతికి హీరో. తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు. అటువంటి మహనీయుడి కడుపులో బిడ్డగా పుట్టడం నా పుర్వజన్మ సుకృతంగా, అదృష్టంగా భావిస్తున్నా' అని అన్నారు.