Feb 01, 2025, 17:02 IST/నల్గొండ నియోజకవర్గం
నల్గొండ నియోజకవర్గం
నల్గొండ: 99 మంది బాలకార్మికులకు విముక్తి
Feb 01, 2025, 17:02 IST
నల్గొండ జిల్లాలో ఆపరేషన్ స్మైల్-11 ద్వారా 99 మంది బాలకార్మికులకు విముక్తి కలిగించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్-11 విడతలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా 99 మంది బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.