రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

70చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం పెండ్లిపాకల ఎక్స్ రోడ్ వద్ద బైక్ ను మరో బైక్ వెనుక నుండి ఢీకొట్టిన ఘటనలో ఉట్లపల్లికి చెందిన శ్రీను(27) అనే వ్యక్తి మృతి చెందగా, కనకయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్