ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 660 గ్రూప్-బీ, గ్రూప్-సీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు ప్రక్రియ మే 29వ తేదీతో ముగియనుంది. అభ్యర్థుల విద్యార్హతలు.. పోస్టులను బట్టి మారుతూ ఉంటాయి. నోటిఫికేషన్ చూస్తే విద్యార్హతలు తెలుసుకోవచ్చు. అభ్యర్థుల కనిష్ఠ వయస్సు గురించి నోటిఫికేషన్లో పేర్కొనలేదు. గరిష్ఠ వయస్సు 56 ఏళ్లలోపు ఉండాలి. దరఖాస్తు, నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: mha.gov.in