తిరుపతికి బస్సు సర్వీసు ప్రారంభం

76చూసినవారు
తిరుపతికి బస్సు సర్వీసు ప్రారంభం
దేవరకొండ ఆర్టీసీ డిపో నుండి తిరుపతికి సూపర్ లగ్జరీ బస్సును సోమవారం పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏడీఎం సైదులు మాట్లాడుతూ ఈ బస్సు దేవరకొండ నుండి ఉదయం 10 గంటలకు బయలుదేరి హైదరాబాద్ చేరుకుని, అక్కడి నుండి మధ్యాహ్నం 2: 30 గంటలకు బయలుదేరి 3: 30కి మాల్, 4: 30కి కొండమల్లేపల్లి, సాగర్ మీదుగా తిరుపతి చేరుకుంటుందని తెలిపారు. రిజర్వేషన్ సౌకర్యం కలదని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్