గ్లోబల్ స్టార్ ప్రభాస్‌టైటిల్ రోల్‌లో నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ. ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తు్న్నాడు. వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా, ముందుగా అందించిన అప్‌డేట్ ప్రకారం కల్కి 2898 ఏడీ ట్రైలర్ లాంఛ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో అలరించనున్నాడు.