డిసెంబర్ 21, 22, 23, 24 తేదీల్లో మిర్యాలగూడలో జరిగే సీపీఎం నల్గొండ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారీ ఐలయ్య పిలుపునిచ్చారు. గురువారం దేవరకొండలో మహాసభలకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే ఏకైక పార్టీ సీపీఎం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, వెంకటయ్య, నాగరాజు, రాములు, తదితరులు పాల్గొన్నారు.