హెల్పింగ్ హాండ్స్ 2కె రన్

847చూసినవారు
హెల్పింగ్ హాండ్స్ 2కె రన్
హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ కార్యక్రమాలు దేవరకొండ డివిజన్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా చిరస్థాయిగా గుర్తుండి పోయే విధంగా కొనసాగుతున్నాయని పట్టణానికి చెందిన హనుమంతు శ్రీనివాస్ గౌడ్ డిగ్రీ ట్రైబల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్యామల అన్నారు. శనివారం హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాక్ ఫర్ చిల్డ్రన్ 2కె వాక్ నీ దేవరకొండ పురపాలక కమిషనర్ వెంకటయ్య నీల రవికుమార్ ప్రారంభించగా తాటి కోల్ ఎక్స్ రోడ్ నుండి మీనాక్షి సెంటర్ కోర్టు గాంధీనగర్ మీదుగా అసోసియేషన్ సభ్యులు పుర ప్రముఖులు మేధావులు ఉపాధ్యాయులు సామాజిక సేవ వేత్తలు స్వచ్ఛంద సంస్థలు పాఠశాల విద్యార్థినిలు మహిళలు 2కే రన్ లో పాల్గొన్నారు. అనంతరం చిన్నారులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ డబ్బులు ఉన్నవాడు కోటీశ్వరుడు కాదని సాయం చేసే ప్రతి ఒక్కరు కోటీశ్వరులు అని సిద్ధాంతాన్ని నమ్మి గత మూడు సంవత్సరాలుగా అసంఖ్యాకంగా విద్యా వైద్య ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహిస్తూ అసోసియేషన్ సేవలను విస్తృత పరుస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అందుకు సహకరిస్తున్న దాతలను సభ్యుల సహకారం మరువలేనిదని ఇటీవల ఓ చిన్నారికి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరితే తమ ద్వారా 7 లక్షల రూపాయలు చిన్నారికి అందించామని ప్రస్తుతం చిన్నారి కోలుకొని ఇంటి దగ్గర ఉందని తెలిపారు. ఏ ఒక్కరు సైతం అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులతో అప్పుడే కళ్ళు తెరిచిన చిన్నారులు మరణ శాసనాన్ని రాసుకునే పరిస్థితికి స్వస్తి చెప్పాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు జరిపిన 2కే రన్ ద్వారా మరింత శక్తివంతంగా చిన్నారుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి తమ సంస్థ ద్వారా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ వెంకటయ్య, కేతావత్ లాలు నాయక్, నీల రవికుమార్, హనుమంతు శ్రీనివాస్ గౌడ్, కేశ నరేష్, హనుమంతు సాయి చంద్ర గౌడ్ , ఏలే రిషి, కేశ నవీన్, ప్రణీత్, చేరుపల్లి జయలక్ష్మి, చీదేళ్ల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్