అక్రమ ఇసుక పట్టివేత

4455చూసినవారు
అక్రమ ఇసుక పట్టివేత
దేవరకొండ మండలంలోని తాటికోలు వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను ఆదివారం రాత్రి వైదోని వంపు సమీపాన వ్యవసాయ పొలంలో అక్రమంగా ఇసుకతో తరలిస్తున్న సరైన ఆర్టిఏ నెంబర్ ప్లేట్లు లేని రెండు ట్రాక్టర్లను తాటి కోల్ సర్పంచ్ జూలూరు ధనలక్ష్మి బాల నారాయణ గౌడ్ గ్రామస్తుల సహకారంతో పట్టుకున్నారు. రెవిన్యూ పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకు ఎస్సై సతీష్ సిబ్బందితో కలిసి రెండు ఇసుక ట్రాక్టర్లను స్టేషన్కు తరలించారు. ఈ విషయమై సీఐ శ్రీనివాస్ తాసిల్దార్ జివిఎన్ రాజుని వివరణ అడగగా పోలీస్ సహకారంతో అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు వారు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్