తాటికలు వాగు నుండి అక్రమ ఇసుక రవాణా

2356చూసినవారు
తాటికలు వాగు నుండి అక్రమ ఇసుక రవాణా
తాటికోలు వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని తాటి కోలు సర్పంచ్ జూలూరు ధనలక్ష్మి వార్డు సభ్యులు గ్రామస్తులు యువకులు మంగళవారం గార్లకుంట సమీపాన మూడు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దేవరకొండ మండలంలోని తాటికలు వాగు నుండి ఇటీవల ఓ కాంట్రాక్టర్ సిసి రోడ్ల నిర్మాణానికి ఇసుకను తరలించడానికి కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ ఏఈ రాతపూర్వకంగా ఇచ్చిన లేఖను ఆధారంగా దేవరకొండ తాసిల్దార్ ఈనెల 5 నుండి 8 వరకు 48 ట్రాక్టర్లను తాటికలు వాగు నుండి తీసుకోవచ్చని ఆదేశాలను జారీ చేశారు. 8వ తరగతి పూర్తయిన తర్వాత తిరిగి సైతం ఎలాంటి పర్మిషన్ లేకుండా తాటికోలు వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని సర్పంచ్ గ్రామస్తులు ఆరోపించారు.

మధ్యాహ్నం సమయంలో గ్రామస్తులతో ఆమె వాగు వద్ద నుండి తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పర్మిషన్ లెటర్ ని చూపించమని కోరారు అయినా నాలుగు గంటల సమయంలో ఎమ్మార్వో నుండి అప్పటికప్పుడు లెటర్లను సృష్టించి చూపించడం ఏమిటని వారు ఆరోపించారు. ట్రాక్టర్ నెంబర్లు ట్రాలీ నెంబర్లు వేరువేరుగా ఉండడం అక్రమంగా తరలించడం కాదా అని వారు తెలిపారు. తమ గ్రామానికి మంచినీటి భూగర్భ జలాలను అందించేటువంటి తాటికోలు వాగు నుండి ఇసుకను తరలించినట్లయితే తమ భూగర్భ జలాలు అడుగంటి పోతాయని వారు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పర్మిషన్ను తనకు గ్రామ సర్పంచ్ గా అందించాలని ఎలాంటి లేఖలను తనకు అందించలేదని ఆమె ఆరోపించారు.

గతంలో ఇదే విధంగా అక్రమదారులు ఇసుకను తరలిస్తున్నటువంటి సమయంలో తమ గ్రామ ఉపసర్పంచ్ అడ్డుకోవడంతో ఉపసర్పంచ్ వాహనాన్ని ఇసుక ట్రాక్టర్లతో గుద్దించి గాయపరిచారని వారు తెలిపారు. గతంలో సైతం అన్ని పార్టీలతో కలిసి ఇసుక తరలింపు ఆపాలని పాదయాత్ర జిల్లా కలెక్టర్కు నివేదికలు అందించామని ఆమె తెలిపారు. సమీప గ్రామాలలో ఇసుక శాంటాక్స్ ఉన్నప్పటికీ ఆ యొక్క గ్రామాలలో జరిగేటువంటి సిసి రోడ్లకు తమ గ్రామపంచాయతీ నుండి ఇసుకను ఎలా తరలిస్తారని వారు తెలిపారు. గార్లకుంట సమీపంలో ఇసుక ట్రాక్టర్లను ఆపి రోడ్డుపై బఠాయించి అక్రమంగా తరలిస్తున్న ఇసుక బకాసురులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు ఎరుకల అశోక్ గౌడ్ గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్