దేశమంతా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంటే చందంపేట మండలం బొల్లరం తండాలో గల ప్రభుత్వ పాఠశాలలో మాత్రం జాతీయ జెండా ఎగురలేదు. ఉపాధ్యాయురాలు గైర్హాజవడంతో పాఠశా లకు వచ్చిన విద్యార్థులు నిరుత్సాహంగా తిరుగుముఖం పట్టాల్సివచ్చింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఉపాధ్యాయురాలిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. 15 మంది విద్యార్థులున్న ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలు ఉండగా ఆ ఉపాధ్యాయురాలు కూడా స్వాతంత్ర దినోత్సవం రోజున బడికి ఎగనామం పెట్టారు. ఈ విషయమై సర్పంచ్ పార్వతి మకట్ లాల్ మాట్లాడుతూ ఇరవై రోజులుగా ఉపాధ్యాయురాలు విధులకు రావడం లేదని, ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.