నేరడుగొమ్ము మండలం వైజక్ కాలని గ్రామ మాజీ సర్పంచ్ దూడ బావోజి తల్లి దూడ అమ్మెరమ్మ మృతి బాధాకరమని నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మెరమ్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.