దేవరకొండలో గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి ఎస్టీ విద్యార్థినిలకు ఈనెల 5, 6 తేదీల్లో స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్వేత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ కౌన్సిలింగ్ అన్ని ఒరిజినల్ పత్రాలు, బోనఫైడ్, పాస్ ఫొటోస్, ఆధార్ కార్డుతో హాజరుకావాలని మరిన్ని వివరాలకు 9908330585, 6300144583 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.