కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం

377చూసినవారు
కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
ముస్లిం మైనారిటీ మహిళలు తమ స్వశక్తి గా ఎదగాలని దేవరకొండ మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ ఛైర్మన్ ఆలంపల్లి నర్సింహ, మహ్మద్ రహత్ అలీలు కోరారు. బుధవారం నగరంలో తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మరియు పినుక్సీ డిజిటల్ ప్రయివేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ మహిళలల కోరకు ఏర్పాటు చేసిన కంప్యూటర్ మరియు కుట్టుశిక్షణ కేంద్రాన్ని వారు ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ఎదిగే విధంగా కృషి చేస్తుందన్నారు. ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ చొరవతో మరిన్నీ సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయం వృథా చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్వచ్చంద సంస్థలు అందిస్తున్న సేవలను వినియోగించుకోవలన్నారు. ఈ సందర్భంగా కంప్యూటర్ మరియు కుట్టుశిక్షణ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం సంస్థ నిర్వాహకులు వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ నగర బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు యండి ఇలియస్ పటేల్, శిక్షణ కేంద్ర ఇంచార్జిలు అరవింద్, ఏఆర్డిఎస్ అధ్యక్షులు సయ్యద్ ఖాజా ఖైరాత్ అలీ, యండి మహమూద్, యండి ఖాజా, బీబీ ఫాతిమా, అయేషా జాబీన్ లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్