ఐదో వార్డ్ లో కంటి వెలుగు ప్రారంభం

847చూసినవారు
ఐదో వార్డ్ లో కంటి వెలుగు ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం బుధవారం దేవరకొండ పట్టణంలోని ఐదవ వార్డులోని బంజారా కాలనీలోని గురుకుల పాఠశాల సమీపాన ఐదో వార్డ్ కౌన్సిలర్ దేవరకొండ మున్సిపల్ మాజీ చైర్మన్ దేవేందర్ తో పాటు మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ద్వారా తెలంగాణలో అందత్వ నివారణే లక్ష్యంగా కొనసాగుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారని అన్నారు. పేదవారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు అందించేటువంటి గొప్ప కార్యక్రమం కంటి వెలుగుని పేర్కొన్నారు. ప్రతిరోజు ఒక్క వార్డులో మూడు రోజులు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తారని, ఇందులో ఒక డాక్టర్, ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్, క్యాంపు మెడికల్ ఆఫీసర్స్, సూపర్వైజర్స్, ఆశాలు తదితరులు పాల్గొంటారని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, రైతుబంధు అధ్యక్షులు శిరందాసు కృష్ణయ్య, డాక్టర్ విజయ, మున్సిపల్ మెప్మా సిబ్బంది జగమంతు, నీల రవికుమార్, ఆర్పీలు గాయత్రీ, విజయలక్ష్మి, మనీ, సరోజ, ఆశాలు, అలివేలు, పద్మ, సుశీల, విజయలక్ష్మి, అంకురి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్