6వ రోజుకు చేరిన సమ్మె

1691చూసినవారు
6వ రోజుకు చేరిన సమ్మె
గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ తెలంగాణ రాష్ట్రానికి అవార్డుల పంటలు పండిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ మానవత్వంతో ఆలోచించి వారిని వెంటనే రెగ్యులర్ చేయాలని దేవరకొండ మండల అధ్యక్షులు మహేశ్వరం వెంకటేష్ అన్నారు. దేవరకొండ పట్టణంలో ఎంపీడీవో కార్యాలయంలో చేపడుతున్న శాంతియుత నిరసన బుధవారానికి ఆరవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయం ముందు డివిజన్ స్థాయి మండలాల వారీగా అధ్యక్షులు మాట్లాడారు అనంతరం ప్ల కార్డులతో పట్టణ పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జూనియర్ పంచాయతీ రాజ్ కార్యదర్శిల మండల కమిటీ అధ్యక్షుడు ఎం వెంకటేష్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిన విధంగా పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు, ప్రొహిబిషన్ పీరియడ్ ముగిసినందున జీవో 26 ను అమలు చేస్తూ ఉద్యోగాలను క్రమ బద్ధీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. జీవో 317 తో నష్టపోయిన పంచాయితీ కార్యదర్శులకు న్యాయం చేయాలని పరస్పర స్పౌజ్ బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సంధ్య, అనిల్ రమేష్ విజయ్ చింతపల్లి మండలం నుండి రమేష్ , నేరేగొ కొమ్ము మండలం నుండి శైలేందర్ , డిండి మండలం నుండి హరి , వేణు , కొండమల్లేపల్లి మండలం నుండి జయేందర్, చందంపేట సతీష్ , నవీన్ , సైదులు, శిరీష, శ్రీకాంత్ , నవీన్ , సాదియా, సమరిన్, రాజేశ్వరి, దివ్య, ప్రియాంక, నీలిమ , ప్రత్యూష, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్