దుర్గామాత దేవాలయంలో చీరలు పంపిణీ
దేవరకొండ పట్టణంలోని ఉప్పు వాగు వద్ద మార్కండేయ స్వామి దేవాలయంలో ప్రతిష్టించినటువంటి దుర్గామాత నవరాత్రుల ఉత్సవంలో భాగంగా దేవాలయంలో సోమవారం దుర్గ మాత శోభాయాత్ర కోసం మహిళలకు చీరలను అధ్యక్షులు సిరిపోతు శ్రీరాములు ప్రధాన కార్యదర్శి సిరందాసు శ్రీనివాసులు మహిళలకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు పెద్ద ఎత్తున కోలాటాలు నిర్వహిస్తు దుర్గామాత శోభాయాత్రను అంగరంగ వైభవంగా పురవీధుల గుండా కోలాటాలతో మహిళలు ఊరేగింపు నిర్వహిస్తారు అని అన్నారు . దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు డ్రెస్ కోడ్ తో అమ్మవారు ఊరేగింపు నిర్వహించాలని అందుకోసం ప్రత్యేకంగా గత పది రోజులుగా దేవాలయంలో మహిళలకు కోలాటం నృత్యాలు నేర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్రం నిరంజన్ ,చిలుకూరి వెంకటేశ్వర్లు ,పగిడి మర్రిసంపూర్ణ ,రఘురాములు, చేరుపెల్లి జయలక్ష్మి, వనం పుష్పలత, పున్న లీలావతి, వనం సుజాత, గుర్రం విజయలక్ష్మి, పగిడిమర్రి యాదమ్మ తదితరులు పాల్గొన్నారు .