దేవర చిత్రానికి U/A సర్టిఫికెట్‌.. మూవీ రన్ టైమ్ ఎంతంటే?

71చూసినవారు
దేవర చిత్రానికి  U/A సర్టిఫికెట్‌.. మూవీ రన్ టైమ్ ఎంతంటే?
యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్‌ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ‘దేవర’. పార్ట్‌ 1 ఈ నెల 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. కాగా ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ మంచి ప్రజాదరణ పొందుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

సంబంధిత పోస్ట్