దేవరకొండ పట్టణంలోని మహాలక్ష్మి మహిళా మండలి ఆధ్వర్యంలో 74 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని అధ్యక్షురాలు మాదిరెడ్డి సంధ్యారెడ్డి శనివారం ఎగరవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎందరో మహిళలు స్వాతంత్య్ర పోరాటంలో అమరులైనరని మహిళలు మగవారికంటే తక్కువేమి అన్నారు.ఈ కార్యక్రమంలో పానుగంటి చంద్రకళ, గాజుల యాదమ్మ, పున్నలీలావతి, టీచర్ యాదమ్మ, చెరుపల్లి జయ లక్ష్మి, తిరందాసు భారతమ్మ, ఉప్పు రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.