డిండిలో పర్యటించిన కలెక్టర్
నల్గొండ జిల్లా డిండి మండలంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సోమవారం పర్యటించారు. వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా మండలంలో పలుచోట్ల పల్లె ప్రకృతి వనం,రైతు వేదిక,హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. ఈసందర్భంగా అధికారులకు పలు సూచనలు చేసి,మిగిలి ఉన్న పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ,ఎంపీడీఓ,స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.