రవీంద్ర నగర్ కాలనీ గ్రీన్ సిటీలో ఆ కాలనీ ప్రజలు ఆదివారం శ్రమదానం చేశారు. కాలనీలో కంపచెట్లు పెరిగిపోయి వర్షపు నీరు చేరి అధ్వానంగా ఉండడంతో శుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్న స్పందించకపోవడంతో కాలనీ ప్రజలు స్వచ్ఛందంగా శ్రమదానం చేశారు.కాలనీలో ఉన్న కంపచెట్లను తొలగించి మురికి కుంటలను శుభ్రం చేశారు.పరిశుభ్రత పాటించాలని పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉండవచ్చని మాజీ కౌన్సిలర్ భవాండ్ల పాండు కోరారు.