మిర్యాలగూడ మండలంలో అనేక ప్రైవేట్ స్కూల్లో నిబంధనలను అతిక్రమించి విద్యార్థులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తు, విద్యా వ్యాపారం చేసే మంగళవారం స్కూల్ ఫీజు వేలల్లో, లక్షల్లో విద్యార్థుల నుండి వసూలు చేస్తున్నారు. ఈరోజు పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు గ్రామీణ ప్రాంత నుండి వచ్చే విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు , బస్సు ఫీజులు, డొనేషన్ ఫీజులు, పేరిట దోపిడీకి పాల్పడుతు విద్యార్థులకు విద్యాను ఆర్థిక భారంగా మార్చుతున్నారు. కావున నిబంధనలను అతిక్రమించి అధిక మొత్తంలో విద్యార్థుల నుండి ఫీజు వసూలు చేస్తున్న విద్యా సంస్థల పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో ABVP టౌన్ సెక్టరీ రోమన్, కిరణ్, మనీష్, బాలకృష్ణ, రోహిత్, తేజ, అహమేడ్, రాము, అఫామ్, హరి, హమంత్, మహేష్, సాంబ, వెంకట్ సాయి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.