కాంగ్రెస్ కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు

174చూసినవారు
కాంగ్రెస్ కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు
మిర్యాలగూడ స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ రాజీవ్ భవన్ నందు 74వ స్వాతంత్య్ర వేడుకను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించి ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఎంతోమంది స్వతంత్య్ర సమరయోధులు ఆంగ్లేయులకు ఎదురొడ్డి భారతదేశానికి స్వాతంత్య్రన్ని సిద్ధించినారు వారి అడుగు జాడల్లోనే కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకుందని తెలిపారు.నేడు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ లౌకిక ప్రజాస్వామ్య విలువలనే విస్మరించి బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు.ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మేధావులు ,ఉద్యోగ విద్యార్థులు ,యువకులు స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తిగా తీసుకొని పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బొద్దుల శ్రీనివాస్, కౌన్సిలర్లు గంధం రామకృష్ణ ,దేశిడి శేఖర్ రెడ్డి ,చిలుకూరి బాలు పొదిల వెంకన్న, పొదిళ్ళ శ్రీనివాస్ ,మోయేజ్ ఖాన్,ఎంపిటిసి ఇజ్రాయిల్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీదేవి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సలీం, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ఆరిఫ్, మేడ వెంకట్ రెడ్డి, నియరుకంటి నారాయణ, పద్మ కాశయ్య, బంటు శ్రీనివాస్, నారాయణమ్మ, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్