హిందూ ముస్లింలు ఐక్యతతో అభివృద్ధి సాదించాలి: ఎమ్మెల్యే

66చూసినవారు
హిందూ ముస్లింలు ఐక్యతతో అభివృద్ధి సాదించాలి: ఎమ్మెల్యే
హిందూ ముస్లింలు ఐక్యతతో అభివృద్ధి చెందాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం రంజాన్ పండుగ పురస్కరించుకుని బంగారుగడ్డ ఈద్గా వద్ద ముస్లింలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలతో పాటు అన్నివర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పని చేస్తుందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.