ఆర్టీసీపై కళాజాత ప్రదర్శన

1773చూసినవారు
ఆర్టీసీపై కళాజాత ప్రదర్శన
ప్రయాణికుల సురక్షిత ప్రయాణమే ఆర్టీసీ ముఖ్య లక్ష్యమని మిర్యాలగూడ డిపో మేనేజర్ శ్రీపాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కళాజాతతో ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం ప్రచార రథంతో జరుగుతున్న కళాబృందం యాత్ర గురువారం మిర్యాలగూడ డిపో బస్టాండ్లో కళాకారులచే ఆర్టీసీపై జానపద రూపంలో కళ ప్రదర్శనను అసిస్టెంట్ డిపో మేనేజర్ సంధ్యారాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ శ్రీపాల్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, దేవరకొండ, నల్లగొండ, నార్కట్పల్లి, యాదగిరిగుట్ట డిపోలలో కళాజాతతో ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు సురక్షిత ప్రయాణం, రాయితీలపై పాట రూపంలో ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రాయితీతో కూడిన పాసులు ఇస్తూ తిరుపతి లాంటి రిజర్వేషన్ తో కూడిన సౌకర్యాలను కల్పిస్తూ సుదూరప్రాంతాలకు సురక్షితమైన ప్రయాణాన్ని చేరవేస్తున్న ఆర్టీసీని ఆదరించాలని అన్నారు. ఆర్టీసీ అభివృద్ధి ప్రయాణికులపై ఆధారపడి ఉందని మరింత అభివృద్ధి పరిచినట్లయితే నిరుద్యోగ యువతకు ఆర్టీసీలో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రైవేటు వాహనాలలో ప్రయాణించవద్దని సురక్షితమైన ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. రాష్ట్ర ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్, నలగొండ ఆర్ఎం శ్రీదేవి, మిర్యాలగూడ డిపో మేనేజర్ శ్రీ పాల్ పర్యవేక్షణలో ఈ యాత్ర కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంఎఫ్ చందర్, కళాజాత సభ్యులు సంపత్, డబ్బి కార్ పెంటోజి, శ్రీహరి, శ్రీనివాస్, గోపన్న, సురేందర్, వేణుగోపాల్, స్వామి, రమణ, వెంకటేష్, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్