లంబోదరుడి లడ్డు వేలం రూ.68116

57చూసినవారు
లంబోదరుడి లడ్డు వేలం రూ.68116
మిర్యాలగూడ మండలం జంకుతండ గ్రామ పంచాయతీ పరిధిలోని మాలోత్ తండాలో ఏర్పాటు చేసిన లంబోదరుడి ముందు ఉంచిన పవిత్రమైన లడ్డూ ధర భారీగా పలికింది. సోమవారం నిమజ్జనానికి ముందు జరిగిన లడ్డూ వేలంలో భక్తులు పోటాపోటీగా పాల్గొనగా మాలోత్ తండాకు చెందిన మాలోత్ విజయ్ నాయక్ రూ. 68, 116కు పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్