2024 లో మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం లౌకికవాదం కనుమరుగవుతుందని వాటిని రక్షించేవాళ్లు ఏకతాటిపైకి రావాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు కోరారు. మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎన్నికల సలహాలు జరుగుతున్నాయని అన్ని పార్టీలు ఎన్నికల క్యాంపియన్లు చేస్తున్నారని తెలిపారు 2024లో బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మరణ శాసనంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి విధానాలను వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలని ఒక వేదిక పైకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అందులో భాగంగానే ఈనెల 23న బీహార్ లో ప్రతిపక్షాల పార్టీల సమావేశం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశానికి సిపిఎం హాజరవుతుందని తెలిపారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి
కేసీఆర్ కూడా హాజరుకావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ హాజరవుతున్నదని, లేదా వేరే కారణమేమో తెలియదు కానీ
కేసీఆర్ ఈ సమావేశానికి హాజరు కావడం లేదని తెలిసిన అని చెప్పారు. హాజరు కావడం హాజరు కాకపోవడం వారి ఇష్టమని బిజెపి ఓడించడమే లక్ష్యంగా ఉంటే హాజరుపై ఆలోచించాలని కోరారు.
మాకు కూడా కేరళలో
కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థంగా ఉందని అయినప్పటికీ బీజేపీని ఓడించాలని లక్ష్యంతో, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ముందుకెళ్తున్నామని చెప్పారు. త్వరలో జరిగే పార్లమెంటు సమావేశంలో
మోదీ ప్రభుత్వం ప్రమాదకరమైన చట్టాలను తీసుకురాబోతుందని చెప్పారు ఢిల్లీలో తీసుకువచ్చిన ప్రజా వ్యతిరేక ఆర్డినెన్స్ను అన్ని పార్టీలు ఖండించారని ఫెడరల్ వ్యవస్థను బలపరచాలని లక్ష్యం ఉన్న వారందరూ ఆ ఆర్డినెన్స్ను వ్యతిరేకించాలని కోరారు. యూనిఫామ్ సివిల్ కోడ్ ను బలవంతంగా దేశంపై రుద్దెందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు దీనివల్ల ప్రజల మధ్య విభజన సృష్టించి మత విద్వేషాలతో
రాజకీయాలు చేయాలని చూస్తుందని ఆరోపించారు. దీనిని ప్రజాస్వామ్యవాదులందరూ వ్యతిరేకించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ
కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నిటిని అమలు చేయాలని అప్పుడే మరోసారి కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పారు.
ధాన్యం అమ్ముకున్న రైతులకు వెంటనే బిల్లులు చెల్లించాలని కోరారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పొడు భూములకు పట్టాలి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇంటి జాగా ఉన్నవారికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తక్షణమే పంపిణీ చేయాలని పరువు లేని పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరారు. పేదలకు గుడిసెలు వేసుకుంటే పీకేయడం, కేసులు పెట్టడం సరింది కాదని ఆ చర్యలను మానుకోవాలని కోరారు. చిత్తశుద్ధితో హామీలను అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తీగల సాగర్ సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.