షార్ట్ సర్క్యూట్ తో పూరి గుడిసె దగ్ధం

5786చూసినవారు
షార్ట్ సర్క్యూట్ తో పూరి గుడిసె దగ్ధం
మంగళవారం విద్యుత్ ఘాతంతో పూరి గుడిసె దగ్ధమైన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం పరిధిలోని అజ్మీర్ తండాలో చోటు చేసుకుంది. గ్రామస్థులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం అజ్మీర్ తండాకు చెందిన దిరావత్ లక్ష్మ ఉదయం రోజు లాగే పొలం పనులకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. 11 గంటల ప్రాంతంలో పూరి గుడిసె నుంచి మొదట పొగలు రాగా, ఆ తరువాత ఒక్కసారిగా పెద్ద మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పూరి గుడిసే పూర్తిగా దగ్ధమైంది. గుడిసెలో ఉన్న బట్టలు, రూ. 50 వేలు నగదు, సామాగ్రి, ఆధార్ కార్డు, విలువైన డాక్యుమెంట్లతో పాటు నిత్యవసర వస్తువులు బూడదయ్యాయి. కట్టుబట్టలతో బాధిత కుటుంబం బజారున పడిందంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి పూరి గుడిసె పూర్తిగా కాలి బూడిదయ్యిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థులు అంతా బకెట్లతో నీటిని తీసుకువచ్చి మంటలను ఆర్పివేశారు. లక్ష్మ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలంటూ గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్