బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని బీసీటియు జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మిర్యాలగూడలో ఊట్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయులు అంజమ్ రాజు ఉద్యోగ విరమణ ఆత్మీయ అభినందన సభ బీసీటియు ఆధ్వర్యంలో టిఎన్ జీవో భవన్ లో నిర్వహించారు. పదోన్నతుల్లో రిజర్వేషన్ల బిల్లు ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని అన్నారు. ఉపాధ్యాయులు సామాజిక మార్పు కొరకు ఉద్యమించాలన్నారు. బీసీ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు ఐక్యతతో పనిచేయాలని వారు తెలిపారు. కార్యక్రమంలో బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మారం శ్రీనివాస్, బీసీ ఉద్యోగుల రాష్ట్ర నాయకులు కోలసైదులు ముదిరాజ్, బీసీ జెఏసి నాయకులు గంగపుత్ర సైదులు, చాపల శ్రీనివాస్, సిపిఎస్ నాయకులు బొమ్మర బోయిన శ్రీనివాస్ యాదవ్, ఉద్యోగులు పాల్గొన్నారు.