తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ఆధ్వర్యంలో జనవరి మాసమంతా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా శనివారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో రోడ్డు భద్రతపై అవగాహన బైక్ ర్యాలీని నిర్వహించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తన మాతృమూర్తి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పోలీస్ శాఖ, స్థానిక నాయకులతో కలిసి వాహనదారులకు 300 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు.