నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని పోతునూరు గ్రామంలో లాక్‌డౌన్‌ను కొందరు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా అన్ని వ్యాపారాలు, షాపులను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, గ్రామంలో కొందరు అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.