నాగార్జునసాగర్ ఎడమ కాలువకు మంగళవారం సాయంత్రం నీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఆయకట్టులో వర్షాబావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటి బావులు, బోర్ల కింద వేసిన వరి చేలు ఎండిపోతుండడంతో రైతుల డిమాండ్ మేరకు గత పది రోజులు నీటిని విడుదల చేశారు. రోజుకు 5000 క్యూసెక్కుల చొప్పున 5 టీఎంసీలు నీటిని వదిలారు. అనంతరం మంగళవారం నుంచి నీటి సరఫరాలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు.