నాగార్జునసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతుండడంతో మంగళవారం 2 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 19,848 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి ఇన్ ఫ్లో 64,567 క్యుసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 70,594 క్యూసెక్కులు ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590. 00 అడుగులకుగాను 589. 90 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 312. 0450 టీఎంసీలకుగాను 3. 11. 7462 టీఎంసీల నీటి నిల్వ ఉంది.