సాగర్ జలాశయానికి స్వల్ప వరద
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు స్వల్ప వరద కొనసాగుతుండడంతో 2 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం జలాశయం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 70, 763 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 589. 90 అడుగుల నీటిమట్టం, 311. 7462 టీఎంసీల నీటి నిల్వ ఉంది.