చిట్యాల మండలంలో సిపిఎం మహాసభకు రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సిబిఐ, ఈడీలను జేబు సంస్థలుగా మార్చి, తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కూల్చి వేసిందని అన్నారు.