చిట్యాల: అగమ్య గోచరంగా మారిన రైతుల పరిస్థితి

54చూసినవారు
చిట్యాల: అగమ్య గోచరంగా మారిన రైతుల పరిస్థితి
చిట్యాల మండల రైతు సంఘం అధ్యక్షులు లడే రాములు శనివారం ఆరెగూడెం గ్రామ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఐకేపి సెంటర్ ప్రారంభించి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క లారీ ధాన్యం కొనుగోలు చేయకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వర్షాలకు ధాన్యం తడిసి మెలకెత్తి, రైతులందరూ దిక్కు తోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్