నకిరేకల్ మండలం చందుపట్లకి చెందిన జిల్లా నాగయ్య శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నాగయ్య వ్యవసాయ కూలీ పనులతో పాటు కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి సోదరుడు డాకయ్య తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై సుధీర్ కుమార్ తెలిపారు.