ఘనంగా ఇంటర్నేషనల్ యూత్ డే

66చూసినవారు
ఘనంగా ఇంటర్నేషనల్ యూత్ డే
నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ యువత దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్
డా. బెల్లి యాదయ్య మాట్లాడుతూ, యువత చెడు వ్యసనాలకు అలవాటుపడకుండా సన్మార్గంలో నడిచి దేశాభివృద్ధికి తోడ్పడాలన్నారు. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని పారద్రోలేందుకు యువత నడుం బిగించాలని కోరారు. విద్యార్థుల చేత డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేయించారు.

సంబంధిత పోస్ట్