నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (2011-2012) బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు, బుధవారం ఆత్మీయ సమ్మేళనం మండలంలోని గోపలాయపల్లి శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి గుట్టపైన నిర్వహించారు. వారి చిన్ననాటి పాఠశాల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆటపాటలతో అందరూ ఆనందంగా గడిపారు.