నకిరేకల్ మండల పరిధిలోని ఒగోడు గ్రామపంచాయతీ శిధిలావస్థకు చేరింది. ఎప్పుడు భవనం కూలిపోతుందో అని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. నూతన భవనం నిర్మించాలని ఎన్ని సార్లు విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. గ్రామ పాలక వర్గం సమావేశం అయే ఈ భవనం ఇలా ఉంటే గ్రామ పాలన ఎలా సాగుతుందని గ్రామస్థులు అంటున్నారు. ఇక నైనా అధికారులు స్పందించి గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించి నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మించాలని కోరుతున్నారు.