సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతున్నదని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అన్నారు. రైతు భరోసా , ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు లబ్ధిదారుల ఎంపికై నిర్వహిస్తున్న గ్రామసభలలో భాగంగా, మంగళవారం ఆయన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం , వంగమర్తి లో నిర్వహించిన గ్రామసభకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి హాజరయ్యారు.