డాక్టర్ మోదాల మల్లేష్ కి సన్మానం

1046చూసినవారు
డాక్టర్ మోదాల మల్లేష్ కి సన్మానం
ప్రముఖ విద్యావేత్త, పోటీపరీక్షల నిపుణులు, నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ మోదాల మల్లేష్ ని బుధవారం కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. తాను జంతుశాస్త్ర విభాగంలో చేసిన పరిశోధనకు గాను కాకతీయ విశ్వవిద్యాలయం ఇటీవల డాక్టరేట్ ను ప్రకటించిన నేపథ్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మధుసూధన్ రెడ్డి, కవిత, హాబీబ్, వెంకన్న, సురేందర్, అంజయ్య, రాధిక, అనిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్